హైదరాబాద్ : వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నుంచి రూ.470 కోట్ల నిధులను పొందినట్లు స్టార్టప్ సంస్థ కేక తెలిపింది. ఒక కంపెనీలో హెచ్‌ఆర్ బృందానికి కావాల్సిన ఆటోమేషన్ అవసరాలను రూపొందిస్తూ.. తాము ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్‌ను అందిపుచ్చుకుంటున్నట్లు కేక సిఇఒ విజరు యలమంచిలి పేర్కొన్నారు. నిధుల సేకరణకు తొందరపడకుండా, ఒక ప్రణాళికతో దీర్ఘకాలం వేచి చూసి సరైన సమయంలో పెద్ద మొత్తంలో వెంచర్ క్యాపిటల్ నిధులను ఆకర్షించగలిగామన్నారు.










