నేటి కాలంలో మహిళల్లో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. వీటిల్లో ప్రధానంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య తీవ్రతరమౌతుంది. మరి కిడ్నీ సమస్యల పరిష్కారానికి వైద్యులు సలహా తెలుసుకుందామా..!
- కిడ్నీల్లో చిన్న చిన్న రాళ్లు ఏర్పడే సమస్య మహిళల్లో ఎక్కువవుతోంది. ఈ సమస్య ఏర్పడడానికి ప్రధాన కారణం హార్మోన్ల మార్పు, జన్యుపరంగానూ ఉన్న సమస్యల వల్ల కిడ్నీల్లో రాళుఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డప్పుడు పొత్తికడుపు, నడుమునొప్పి తీవ్రంగా ఉంటుంది. యూరిన్‌లో బ్లడ్ కనబడడం, తరచూ యూరిన్‌కి వెళ్లాల్సి రావడం వంటి సమస్యలతో బాధపడతారు. ఈ సమస్యల నివారణకు పుష్కలంగా నీరు తాగాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి అని పూనెలోని మణిపాల్ హాస్పటల్‌కి చెందిన డాక్టర్ ఆనంద్ ధరాస్కర్ తెలిపారు.
- యూరినరీ ఇన్ఫెక్షన్ల ద్వారా పురుషులు కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతారని వైద్యులు చెబుతున్నారు. యూరినరీ ఇన్ఫెక్షన్లకు తక్షణ చికిత్స తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
- ముప్పై ఏళ్లకు పైబడిన మహిళలు అధిక రక్తపోటుకు గురవుతారు. ఈ సమస్య వల్ల కూడా సాధారణంగా కిడ్నీ సమస్యలకు గురయ్యే ప్రమాదముంది. కిడ్నీ పనితీరుపై అధిక రక్తపోటు ప్రభావం అధికంగా ఉంటుంది. అధిక బరువు ఉన్నా కిడ్నీ సమస్యలకు గురయ్యే అవకాశమున్నట్లు వైద్యులు తెలిపారు.
- కిడ్నీ సమస్యల నుంచి మహిళలు దూరంగా ఉండాలంటే ఆరోగ్యశైలిలో మార్పులు తప్పనిసరి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. పురుషుల్లో అయితే పొగ తాగడం, ఆల్కహాల్ సేవించడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కిడ్నీ సమస్యలకు గురైతై తక్షణమే వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.