Nov 09,2022 21:26

హైదరాబాద్‌ : ప్రముఖ అమ్యూజింగ్‌ పార్క్‌ వండర్‌లా హాలిడేస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.10.53 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.9.28 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ2లో అమ్మకాలు 283.73 శాతం పెరిగి రూ.66.04 కోట్లుగా నమోదయ్యినట్లు తెలిపింది.