May 22,2023 11:39

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌) : రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా ... గత మూడు రోజుల నుండి, నందిగామ నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో, జిల్లా పరిషత్‌ పాఠశాల వద్ద జరిగిన రాజీవ్‌ స్మారక క్రికెట్‌ టోర్నమెంట్లో విజయం సాధించిన క్రీడాకారులకు మొదటి బహుమతి రూ.15,016, రెండవ బహుమతి రూ.10,016, మూడవ బహుమతి రూ.7,016లను క్రీడాకారులకు బహుమతిగా అందజేశారు. ఏ. పి స్టేట్‌ యూత్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ, గొల్లా పవన్‌ కుమార్‌, ఎన్టీఆర్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు బొర్రా కిరణ్‌, బర్రా కిరణ్‌ మాట్లాడుతూ ... యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందిస్తూ కార్యక్రమం జరిగిందని తెలిపారు. యువజన కాంగ్రెస్‌ నాయకుడు షేక్‌ ఆరీఫ్‌ మాట్లాడుతూ ... నేటి యువత రాజకీయాలకు ప్రముఖ పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొదటి బహుమతిని స్పాన్సర్‌ చేసిన ఏపీ కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ వి.గురునాధం, రెండవ బహుమతి స్పాన్సర్‌ చేసిన కామ శాంతకుమార్‌, మూడవ బహుమతి స్పాన్సర్‌ చేసిన అద్దంకి జీవరత్నం, పి.సి.సి.మెంబర్‌ దేవరకొండ శ్రీనివాస్‌, పి. సి. సి మెంబర్‌ పాలేటి సతీష్‌, జిల్లా కార్యదర్శి పెసరమల్లి శ్యాం బాబు, జిల్లా కాంగ్రెస్‌ సభ్యులు కనకపుడి వెంకటేశ్వర్లు, నందిగామ నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు షేక్‌ ఆరీఫ్‌, టౌన్‌ ప్రెసిడెంట్‌ కామ శ్రీను, మండల ప్రెసిడెంట్‌ గోపు నరేంద్ర, షేక్‌ మస్తాన్‌, కామ శాంతకుమార్‌, బి.కేశవ, ఏ.జగదీష్‌, కే.కఅష్ణ, చింతాల్‌, పాషా, తదితర కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.