Sep 10,2023 21:52

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం:తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. టిడిపి అధినేత చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలిస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది. నగరంలో 37 చోట్ల పోలీసు పికెట్‌లు ఏర్పాటు చేశారు. సెంట్రల్‌ జైల్‌ రోడ్డును మూడు కిలోమీటర్ల మేర బ్లాక్‌ చేశారు. నగరంలోని టిడిపి ముఖ్య నాయకులందరినీ గృహ నిర్బంధం చేశారు. నంద్యాలలో మాదిరిగా ఘర్షణలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. నగరం మొత్తం పోలీసులు మోహరించారు.