Sep 14,2023 08:54

ప్రజాశక్తి-రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడును కలవడానికి బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌లు నేడు వెళ్లనున్నారు. ఉదయం 11.30 గం.ల సమయంలో కలవనున్నారు. చంద్రబాబుతో ములాఖాత్‌ అనంతరం వీరు జైలు బయటే మీడియాతో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్ద భద్రతను అధికారులు పెంచారు. దాదాపు 300 మంది పోలీసులతో బందోబస్తుతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్ట్స్‌ కాలేజ్‌ వద్ద వాహనాల దారి మళ్లింపుచేశారు. ఎయిర్పోర్ట్‌ నుండి సెంట్రల్‌ జైలు వరకు పోలీసుల పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.