Apr 21,2023 12:04

ఇంటర్నెట్‌డెస్క్‌ : వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిల్లో ప్రధానంగా నోటిపూత ఈ కాలంలో తీవ్రంగా బాధిస్తుంది. నోటిపూత సమస్యలు రావడానికి అనేక కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. మరి ఈ నోట పూత సమస్య నుండి బయటడాలంటే.. కొన్ని చిట్కాలు పాటించండి. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..!

- వేసవిలో ఉదయాన్నే ఒక గ్లాసు కొబ్బరినీళ్లు తాగితే నోటిపూత సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. కొబ్బరి నీళ్లలో మెగ్నీషియం, పొటాషియం, ప్రొటీన్‌, ఫైబర్‌లు ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. వేసవిలో కొబ్బరినీటిని తాగితే శరీరం చల్లగా ఉంటుంది. అందుకే వైద్యులు ఏ వయసువారైనా ఈ కాలంలో కొబ్బరినీళ్లను తాగితే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. కేవలం కొబ్బరినీళ్లు మాత్రమే కాదు.. నిమ్మకాయ కలిపిన మజ్జిగ ప్రతి రెండు గంటలకు ఒకసారి తీసుకోవచ్చని చెబుతున్నారు. నీటిశాతం ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, కీరదోసకాయ, ద్రాక్ష వంటి పండ్లను తీసుకోలి. శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకుంటే.. నోటిపూత సమస్యలు రావని డాక్టర్లు అంటున్నారు.
- గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి ఆ నీటిని రోజుకు 8 నుండి పదిసార్లు నోటిని శుభ్రం చేసుకుంటే నోటిపూత తగ్గుతుంది.
- తాజా జామ ఆకును నమిలి ఆ రసాన్ని మింగితే.. నోటిపూత తగ్గుతుంది.
- నీటిలో కొంచెం పసుపు వేసి మరిగించి.. ఉదయం, సాయంత్రం ఆ నీటితో పుక్కిలిస్తే.. నోటి అల్సర్‌ను త్వరగా తగ్గుతుంది.