Jun 03,2023 12:59

ఒడిశా : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 261 పైగా మృత్యువాత పడగా.. 900 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పెను ప్రమాదంపై భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపాడు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో ఇంత మంది మృతి చెందడం తన మనసును కలిచి వేసిందని విరాట్‌ ట్వీట్‌ చేశాడు.