ఓస్లో(నార్వే): ఫిడే నార్వే చెస్ టోర్నమెంట్‌లో యువ గ్రాండ్ మాస్టర్ జి. గుకేశ్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. సోమవారం 6వ రౌండ్‌లో అనిశ్ గిరితో తలపడిన గుకేశ్.. ఆర్మ్‌జెడాన్‌లో 58 ఎత్తుల తర్వాత డ్రాగా ముగించాడు. క్లాసిఫికేషన్ ఫార్మాట్‌లో 58 ఎత్తుల అనంతరం ఆ గేమ్‌ను డ్రాగా ముగించిన గుకేశ్.. ఆర్మ్‌జెడాన్‌లో 48ఎత్తుల తర్వాత ఆ గేమ్‌ను డ్రాగా ముగించాడు. అనంతరం గుకేశ్ మాట్లాడుతూ.. 'తనకన్నా బలమైన ప్రత్యర్ధితో గేమ్‌ను డ్రాగా ముగించినందుకు సంతోషంగా ఉందని, అద్భుత ఆటతీరుతో రాణిస్తుండడంతో ఫలితం వచ్చే అవకాశముందని' తెలిపాడు. దీంతో 6వ రౌండ్ ముగిసిన అనంతరం గుకేశ్ కరువానా, హికారు నకమురా, అలీరెజా ఫిరౌజ్జాలతో కలిసి సంయుక్తంగా 3వ స్థానంలో కొనసాగుతున్నాడు.










