- అధికారికంగా ప్రకటించిన ఫ్రాంచైజీ
కోల్‌కతా: కోత్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా నితీశ్ రాణా ఎంపికయ్యాడు. ఆ ఫ్రాంచైజీ సోమవారం ఓ ప్రకటనలో జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరం కావడంతో ఐపిఎల్-2023 సీజన్‌కు నితీశ్ రాణాను ఎంపిక చేసినట్లు పేర్కొంది. కెప్టెన్ రేసులో వెస్టిండీస్ దిగ్గజ స్పిన్నర్ సునీల్ నరైన్, షకీబ్, ఆండీ రస్సెల్ పేర్లనూ పరిశీలించినా.. చివరకు యువ క్రికెటర్ నితీశ్ రాణావైపు ఫ్రాంచైజీ సభ్యులందరూ మొగ్గు చూపినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.










