Oct 12,2023 14:19

ప్రజాశక్తి-అమరావతి : స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో టీడీపీ యువనేత నారా లోకేష్‌ పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్పోజ్‌ చేసింది. ఈ కేసులో లోకేష్‌ను నిందితుడిగా చూపలేదని.. అందువల్ల ఆయనను అరెస్ట్‌ చేయబోమని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఒకవేళ కేసులో లోకేష్‌ పేరును చేర్చితే... అప్పుడు 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని చెప్పింది. అరెస్ట్‌ చేయబోమని సీఐడీ స్పష్టం చేయడంతో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్‌ చేసింది.