- తొలిరౌండ్‌లోనే ఓడిన సైనా
ఓర్లీన్స్(ఫ్రాన్స్): ఓర్లీన్స్ మాస్టర్స్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్లు మిథున్ మంజునాథ్, ప్రియాంశు శుభారంభం చేయగా.. మహిళల సింగిల్స్‌లో లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ తొలిరౌండ్‌లోనే పరాజయాన్ని చవిచూసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో మిథున్ 24-22, 25-23తో విక్టర్ సెవెండ్సెన్(డెన్మార్క్)పై, ప్రియాంశు రాజవత్ 21-18, 21-13తో భారత్‌కే చెందిన కిరన్ జార్జిపై గెలుపొందగా.. సమీర్ వర్మ 19-21, 21-19, 17-21తో నుయేన్(వియత్నాం) చేతిలో పోరాడి ఓడాడు. ఇక మహిళల సింగిల్స్‌లో తాన్యా హేమంత్ 21-17, 21-18తో హెట్(ఫ్రాన్స్)ను ఓడించగా.. సైనా నెహ్వాల్ 16-21, 14-21తో నెస్తన్ హెట్(టర్కీ) చేతిలో వరుససెట్లలో ఓటమిపాలైంది. మరో ఉత్కంఠ పోటీలో తస్మిన్ మీర్ 22-20, 13-21, 5-21తో యొన్నె లీ(జర్మనీ) చేతిలో పోరాడి ఓడింది. మరో పోటీలో ఆకర్షీ కశ్యప్ 8-21, 21-13, 8-21తో నిడైర్యా(జపాన్) చేతిలో ఓటమిపాలైంది.










