Apr 03,2023 20:49

న్యూయార్క్‌: మియామీ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను రష్యాకు చెందిన టాప్‌సీడ్‌ డానియెల్‌ మెద్వదెవ్‌ గెలుచుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో మెద్వదెవ్‌ 7-5, 6-3తో జన్నిక్‌ సిన్నర్‌(ఇటలీ)పై వరుససెట్లలో నెగ్గాడు. తొలిసెట్‌లో హోరాహోరాగా సాగినా.. రెండో సెట్‌లో మెద్వదెవ్‌ ప్రత్యర్ధిపైగా ఆధిపత్యం చెలాయించాడు. దీంతో మెద్వదెవ్‌ నాల్గోసారి మియామీ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతోపాటు ఓవరాల్‌గా 19వ మేజర్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూయార్క్‌, సౌత్‌ ఫ్లోరిడాలోని హార్డ్‌రాక్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరిగింది. టైటిల్‌ విజేతగా నిలిచిన మెద్వదెవ్‌కు సుమారు 1.3మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ దక్కింది.
జకోవిచ్‌కు అగ్రస్థానం..
అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య(ఏటిపి) ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో సెర్బియాకు చెందిన నొవాక్‌ జకోవిచ్‌ మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకాడు. గత వారం దుబారు ఓపెన్‌ టైటిల్‌ విజేతగా నిలిచిన అల్కరాజ్‌ జకోవిచ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుగా.. ఏటిపి సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో అల్కరాజ్‌ను వెనక్కి నెట్టి జకోవిచ్‌ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. భారత్‌కు చెందిన రోహన్‌ బొప్పన్న డబుల్స్‌లో 13వ స్థానంలో నిలువగా.. పురుషుల సింగిల్స్‌లో సుమిత్‌ నాగల్‌ 372ర్యాంక్‌కు చేరుకున్నాడు.

table