పురుషుల సింగిల్స్ ఫైనల్ ఆదివారం జరగనుంది. 3వ సీడ్, సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్, నార్వేకు చెందిన 4వ సీడ్ కాస్పర్ రూఢ్‌ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. జకోవిచ్ టైటిల్ నెగ్గితే 23వ గ్రాండ్‌స్లామ్ లతో రికార్డు నెలకొల్పనున్నాడు. రూఢ్ ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. సెమీస్‌లో జకోవిచ్ 6-3, 5-7, 6-1, 6-1తో టాప్‌సీడ్ అల్కరాజ్‌పై రూఢ్.. 22వ సీడ్, జర్మనీకి చెందిన జ్వెరేవ్‌పై 6-3, 6-4, 6-0తో గెలిచి ఫైనల్‌కు చేరారు. ముఖాముఖి పోరులో జకోవిచ్ 4-0 ఆధిక్యతలో ఉన్నాడు.










