ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సంక్రాంతి ముక్కనుమ సందర్భంగా... మాంసం ధరలకు రెక్కలొచ్చాయి. కనుమ పండుగ సోమవారం రావడంతో ఈరోజు మాంసం దుకాణాలు జనాలతో కిక్కిరిశాయి. పండగ డిమాండ్‌తో ఒక్కసారిగా మాంసం ధరలు పెంచి అమ్ముతున్నారు. రూ.180 చికెన్ కేజీ ధర, 230 లకు పెంచేశారు. మటన్ కేజీ 750 నుంచి 850 పెంచేసి అమ్ముతున్నారు. చేపలు కేజీ 110, 120 నుంచి 140, 150 కి పెంచి అమ్ముతున్నారు. విజయనగరంలో చికెన్, మటన్, చేపలు మార్కెట్లో జనం కిక్కిరిసి ఉన్నారు. ప్రధానంగా కంటోన్మెంట్ గణేష్ కోవెల జంక్షన్, రింగ్ రోడ్డు చేపల మార్కెట్, అర్ అండ్ బి చేపల మార్కెట్, యూత్ హాస్టల్ వద్ద, గూడ్స్ షేడ్, పాత బస్ స్టాండ్ వద్ద, వై.జంక్షన్ వద్ద ఉన్న మాంసం విక్రయ కేంద్రాలు రద్దీగా ఉన్నాయి.