ప్రజాశక్తి-నందలూరు(అన్నమయ్య జిల్లా) : లయన్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కోఆర్డినేటర్‌గా మన్నెం రామ్మోహన్ ఎంపికైనట్లు సౌమ్యనాథ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కుర్రా మణి యాదవ్, ట్రెజరర్ శ్యామనబోయిన గురు ప్రసాద్‌లు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ డిప్యూటీ గవర్నర్‌గా సేవలందిస్తూ, లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు 2022-23 సంవత్సరమునకు గాను లయన్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కోఆర్డినేటర్‌గా ఎన్నికైనట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు ప్రేరణగా నిలవాలని కోరారు.










