Nov 27,2022 13:16

ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత కంటి, కీళ్లు, ఎముకలకు సంబంధించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు సప్తగిరి మల్లికార్జున పేర్కొన్నారు. ఆదివారం లయన్స్‌ క్లబ్‌ కార్యాలయంలో కంటి, ఎముకులకు సంబంధించి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... శ్రీ చక్ర హాస్పిటల్‌ కర్నూలు వారి సహకారంతో వైద్యాధికారులు శ్రీనివాస్‌, షాషావలి వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు. 339 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని ఆపరేషన్‌ కోసం 80 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. 195 మందికి కీళ్లు ఎముకలకు సంబంధించి పరీక్షలు చేపట్టారు. అవసరమైన వారికి కంటికి సంబంధించి కీళ్లు ఎముకలకు సంబంధించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కంటి ఆపరేషన్లకు ఎంపికైనవారిని ఆపరేషన్ల కోసం పంపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ ఉపాధ్యక్షులు చందాకేసన్న, రీజియన్‌ చైర్మన్‌ కొమ్మసాని బాలచంద్ర, ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ గణేష్‌ బాబు, కార్యదర్శి బి.లక్ష్మీనారాయణ, కోశాధికారి నజీర్‌ సాబ్‌, కార్యవర్గసభ్యులు ప్రభాకర్‌, సత్యనారాయణ, నాగేశ్వరరావు, జయకఅష్ణ, గంగాధర్‌, జయన్న, శ్రీరాములు, సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.