ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులని లైన్స్ క్లబ్ అధ్యక్షులు గుండు వీరతాతరాజు అన్నారు. స్థానిక సత్య శ్రీ రోడ్ లోని లైన్స్ క్లబ్ భవనంలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం రాత్రి రావులపాలెం, మండపేట మండల విద్యాధికారులు పి.శాలెం రాజు, నాయుడు రామచంద్రరావు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామిరెడ్డి వెంకటరమణ, సంక సూర్యనారాయణలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ టీ.రామ్ కుమార్, లైన్స్ క్లబ్ ప్రతినిధి దాసరి తిరుమలరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ... తల్లిదండ్రులు చిన్నారులకు జీవితాలనిస్తే వారిని సక్రమ మార్గంలో పెట్టి ఉన్నతులుగా తీర్చిదిద్దగలిగే గొప్పవారే ఉపాధ్యాయులన్నారు. భారత తొలి రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ రాజనీతిజ్ఞుడని, విలువలను పరిరక్షించడం కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ ప్రతినిధులు నాగేంద్రబాబు,కొనే వీర్రాజు, కర్రి నారాయణ రెడ్డి, కాళ్ళబాబు, చక్క రాంబాబు తదితరులు పాల్గొన్నారు.










