ప్రజాశక్తి మండపేట (కోనసీమ) : ఇంజనీరింగ్ పితామహులు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్లను సత్కరించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో రాకుర్తి సత్యనారాయణ, గనిశెట్టి శ్రీనివాసరావు , రాకుర్తి వినరులను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గుండు తాతరాజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ ప్రతినిధులు కొనే వీర్రాజు, చెన్న రాంబాబు, కురసాల సత్యనారాయణ పాల్గొన్నారు.










