థాయ్ లాండ్ ఓపెన్‌లో ముగిసిన భారత్ పోరు
బ్యాంకాక్: థారుాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌కు చేరిన ఏకైక షట్లర్ లక్ష్యసేన్ సెమీస్‌లో ఓటమిపాలయ్యాడు. శుక్రవారం జరిగిన సెమీస్ పోటీలో లక్ష్యసేన్ 21-13, 17-21, 13-21తో విటిడ్‌శరణ్(థాయ్ లాండ్) చేతిలో పోరాడి ఓడాడు. హామర్క్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్ ప్రత్యర్ధికి ముచ్చెమటలు పట్టించాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా నెగ్గిన లక్ష్యసేన్.. రెండో గేమ్‌లో ప్రత్యర్ధిగా గట్టి పోటీనిచ్చాడు. పోటా పోటీగా సాగిన ఆ గేమ్‌లో లక్ష్యసేన్ చివర్లో ఒత్తిడి గురై 17-21తో ఆ గేమ్‌ను చేజార్చుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో విటిడ్‌శరణ్ తొలినుంచే లక్ష్యసేన్‌పై ఒత్తిడి పెంచాడు. దీంతో ఆ గేమ్‌లో లక్ష్యసేన్ పుంజుకోలేకపోయి ఓటమిని చవిచూశాడు.










