Jun 03,2023 22:07

విండ్‌హోక్‌(నమీబియా): నమీబియా పర్యటనలో ఉన్న కర్ణాటక జట్టు తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. వాండెరర్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో శనివారం జరిగిన తొలి వన్డేలో కర్ణాటక జట్టు 9వికెట్ల తేడాతో నమీబియాపై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచిన కర్ణాటక జట్టు తొలిగా ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన నమీబియా జట్టు 41.1 ఓవర్లలో 171పరుగులకు కుప్పకూలింది. కావేరప్ప(4/16), రిషీ బప్పన్న(3/34) బౌలింగ్‌లో మెరిసారు. ఛేదనలో కర్ణాటక ఓపెనర్లు ఛేతన్‌, నికిన్‌ జోసే తొలి వికెట్‌కు సెంచరీ (111పరుగులు) భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్‌ రవికుమార్‌ సమర్థ్‌(78నాటౌట్‌), నికిన్‌(56నాటౌట్‌) అర్ధసెంచరీలతో మెరిసారు. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో కర్ణాటక జట్టు 1ా0ఆధిక్యతలో నిలిచింది.