Apr 01,2023 14:05

ఘన విజయంతో ఐపీఎల్‌ 16వ సీజన్‌ ను ఆరంభించిన ఆనందంలో ఉన్న డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు షాక్‌ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ ఈ సీజన్‌ నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్‌లో నిన్న రాత్రి జరిగిన తొలి పోరులో సీఎస్కే ఇన్సింగ్స్‌ 13వ ఓర్లో జోషువా లిటిల్‌ వేసిన బంతిని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెననర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ దిశగా ఆడాడు. ఈక్రమంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న విలియమ్సన్‌ గాల్లోకి ఎగిరి దాన్ని అందుకునే ప్రయత్నం చేశాడు. బౌండ్రీ లైన్‌ వద్ద డైవ్‌ చేసిన కేన్‌ కుడి మోకాలికి గాయం అయింది. నొప్పితో విలవిల్లాడిన కేన్‌ కనీసం నడవ లేకపోయాడు. సహాయ సిబ్బంది తమ భుజాలపై అతడిని బయటికి తీసుకెళ్లారు. అతను తిరిగి గ్రౌండ్‌లోకి రాలేదు. కేన్‌ మోకాలికి అయిన గాయం చాలా తీవ్రమైందని గుజరాత్‌ టైటాన్స్‌ హెడ్‌ కోచ్‌ గ్యారీ కిర్‌ స్టన్‌ చెప్పాడు. తర్వాతి మ్యాచుల్లో ఆడే పరిస్థితి కష్టమమేనన్నాడు.