- రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పార్లమెంటులో విద్యుత్ చట్ట సవరణ-2022 బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే పనులు నిలిపివేస్తామని ఎపి విద్యుత్ ఉద్యోగుల జెఎసి హెచ్చరించింది. ప్రజలకు నష్టదాయకమైన విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనునుట్లు వెల్లడించింది. ఈ మేరకురాష్ట్ర ఇంధనశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌కు జెఎసి ఛైర్మన్ పి చంద్రశేఖర్, సెక్రటరీ జనరల్ పి ప్రతాప్‌రెడ్డి, కన్వీనరు బి సాయికృష్ణ శనివారం లేఖ రాశారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ నేషనల్ కోాఆర్డినేషన్ కమిటీ (ఎన్‌సిసిఒఇఇఇ) పిలుపులో భాగంగా ఈ ఆందోళనలు నిర్వహిస్తునుట్లు వెల్లడించారు. ఈ ప్రజా వ్యతిరేక బిల్లు తీసుకొచ్చేముందు తమతో సంప్రదింపులు జరపాలని విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్లు కోరినా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యుత్‌శాఖ ఇప్పటి వరకు స్పందించలేదని విమర్శించారు. స్టేక్ హోల్డర్లతో సంప్రదించకుండా ఈ బిల్లును చట్టం రూపంలో తీసుకురాబోమని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం)కుకేంద్ర ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చిందనితెలిపారు. స్టేక్ హోల్డర్లు, రైతులు, విద్యుత్ ఉద్యోగుల యూనియన్లతో సంప్రదింపులు జరపలేదని పేర్కొన్నారు. ఇచ్చిన హామీకి భినుంగా ఈ బిల్లును ప్రస్తుతం జరుగుతును పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం చూస్తోందని పేర్కొన్నారు. ఈ నెల 2వ తేదీన ఢిల్లీలో సమావేశమైన ఆలిండియా విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్ల సంఘాలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా 'సేవ్ పవర్ సెక్టార్‌ాసేవ్ ఇండియా' పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చినట్లు వివరించారు. ఈ పిలుపులో భాగంగా రాష్ట్రంలో కూడా ఆందోళనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం 80వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 8న విద్యుత్ సంస్థల కార్యాలయాలు, సర్కిల్ హెడ్‌క్వార్టర్స్ వద్ద సామూహిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని వివరించారు. బిల్లు ప్రవేశపెట్టే రోజు పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు.










