న్యూఢిల్లీ : దేశంలో 5జి సేవలను ప్రారంభించిన నెల రోజుల్లోనే 10 లక్షల 5జి కనెక్షన్లు జారీ చేసినట్లు భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, చెన్నరు, బెంగళూరు, సిలిగుడి, నాగ్‌పూర్, వారణాశి నగరాల్లో 5జి సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని ఆ సంస్థ గుర్తు చేసింది. చాలా మొబైల్ పరికరాల్లో తమ 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిందని పేర్కొంది. తమ వినియోగదారులు సిమ్ కూడా మార్చకుండానే ఇప్పుడున్న ప్లాన్లతోనే హైస్పీడ్ 5జీ సేవలను పొందవచ్చని తెలిపింది.










