- నగరంలో డిజైన్ డెమోక్రసీ ఏర్పాటు
హైదరాబాద్ : ఇంటీరియర్, లైఫ్‌స్టైల్‌కు సంబంధించి ప్రీమియర్ డిజైన్ ఫెస్టివల్, డిజైన్ డెమోక్రసీ 2023ను అక్టోబర్ 13 నుంచి 15 తేదిల్లో ఏర్పాటు చేస్తున్నట్లు డిజైన్ డెమోక్రసీ వ్యవస్థాపకురాలు పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. నగరంలోని ఎన్ కన్వెన్షన్‌లో జరుగనుందన్నారు. ఇందులో 70 మంది ఎగ్జిబిటర్లు తమ ఫర్నీచర్, ఇంటీరియర్ డిజైన్ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఆర్డర్‌పై కొనుగోలు కూడా చేసుకునే సౌలభ్యం ఉంటుందన్నారు. దేశంలోని ప్రధాన నగరాల నుంచి ఎగ్జిబిటర్లు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఫర్నిచర్, లైట్లు, కార్పెట్‌లు, సాఫ్ట్ ఫర్నిషింగ్‌లు, యాక్సెసరీలు, ఫైన్ ఆర్ట్‌తో సహా పలు విభాగాల్లో దాదాపు 60కి పైగా లగ్జరీ బ్రాండ్‌లు ఇక్కడకు రానున్నాయని ఈవెంట్ క్యూరేటర్ అర్జున్ రాఠీ తెలిపారు.










