హైదరాబాద్ : భారత ఔషద రంగ పరిశ్రమ 200 దేశాలకు ఉత్పత్తులను అందిస్తుందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపిఎ) సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ అన్నారు. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు సాగనున్న 'ఫార్మా ప్రో అండ్ ప్యాక్ ఎక్స్‌పో 2022' గురువారం ప్రారంభమైంది. తొలి రోజు జైన్ మాట్లాడుతూ ప్రస్తుతం భారత ఫార్మా పరిశ్రమ 49 బిలియన్ డాలర్ల విలువ చేస్తుందన్నారు. 2030 నాటికి ఇది 130 బిలియన్ డాలర్లకు చేరొచ్చని ఆయన అంచనా వేశారు. ఎగుమతుల మార్కెట్‌ను మరింత అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.










