Oct 10,2023 11:01

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా కేసులు నిత్యం వెలుగు చూస్తున్నాయి. నిన్న కోటి రూపాయలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు. నేడు ఓ ప్రయాణికుడి దగ్గర 2 బంగారు బిస్కెట్లు, 01 బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘనటపై వివరాల ప్రకారం.. రియాద్‌ అనే వ్యక్తి మస్కట్‌ మీదుగా ఒమన్‌ ఎయిర్‌లైన్స్‌లో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అతను అనుమానాస్పదంగా తిరగడం గమనించిన అధికారులు అతనిని విచారించి తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి దగ్గర 2 బంగారు బిస్కెట్లు, 01 బంగారు చైన్‌ ఉన్నట్లు గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని.. అనంతరం నిందితుడిని కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు.