బరువు బాగా పెరిగారని.. డైట్ పాటిస్తూ పోషక పదార్థాలున్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే.. బరువు తగ్గడం అటుంచి మీరు ఊహించనంతగా అధిక బరువు పెరుగుతారు అని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. మరి ఆ ఆహారాలేంటో తెలుసుకుందామా..!
- బరువు తగ్గేందుకు మీరు పప్పుధాన్యాలు, గింజలు, చికెన్ వంటివాటిని ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రొటీన్ అధికంగా ఆహారాన్ని తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయదనే భావనతో మోతాదుకి మించి తీసుకుంటే బరువు తగ్గడం అటుంచి... మరింత పెరిగే అవకాశముందని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు.
- ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని సమతుల్యంగా తీసుకుని.. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఫైబర్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే.. జీర్ణక్రియకు, ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఫైబర్ ఫుడ్స్ వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశముందని కూడా వైద్యులు సూచిస్తున్నారు.