Mar 29,2023 16:29

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో శుక్రవారం నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 16వ సీజన్‌ ప్రారంభం కానుంది.ఎ ప్పట్లాగానే టోర్నీ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఐపీఎల్ పాలకమండలి నిర్ణయించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో మిల్కీ బ్యూటీ తమన్నా డాన్స్ పెర్ఫార్మెన్స్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. మార్చి 31న సాయంత్రం 6 గంటలకు ఐపీఎల్ ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. ఈ ఈవెంట్ లో తమన్నాదే తొలి ప్రదర్శన కానుంది. కాగా, ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొనే ఇతర స్టార్ల వివరాలను కూడా ఐపీఎల్ వెల్లడించనుంది. ఐపీఎల్-16 ప్రారంభ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.