Mar 29,2023 14:33

క్రికెట్‌ అభిమానులను అలరించడానికి.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదహారో సీజన్‌ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా లీగ్‌లో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ సరికొత్త రోల్‌ పోషించనున్నాడు.  ఐపీఎల్‌ తాజా సీజన్‌లో తన వ్యాఖ్యానంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు టోర్నీ అధికారిక ప్రసారకర్త స్టార్‌ స్పోర్ట్స్‌తో స్టీవ్‌ స్మిత్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐపీఎల్‌-2023 కోసం స్టార్‌ స్పోర్ట్స్‌ క్రికెట్‌ నిపుణుల ప్యానెల్లో తాను కూడా భాగం అయ్యానని స్మిత్‌ వెల్లడించాడు. కామెంటేటర్‌గా సరికొత్త పాత్రలోకి ప్రవేశిస్తున్నానని వెల్లడించాడు. ఆటను బాగానే అర్థం చేసుకోగలనని, విశ్లేషించగలనని తెలిపాడు. ఐపీఎల్‌ లో స్టార్‌ స్పోర్ట్స్‌ బందంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఈ ఆసీస్‌ మాజీ సారథి పేర్కొన్నాడు.