విజయవాడ : ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (ఐఒబి) విజిలెన్స్ అవేర్‌నెస్ వారోత్సవాలను నిర్వహిస్తుంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 6వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాల్లో భాగంగా గురువారం విజయవాడలోని ఆ బ్యాంక్ రీజినల్ కార్యాలయం సిబ్బంది మానవ హారాని నిర్వహించారు. బెంజ్ సర్కిల్ రోడ్డులో ప్రక్కన నిలబడి ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించి.. నినాధాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐఒబి ఆర్‌ఒ విజయవాడ ప్రాంతీయ మేనేజర్ సుబోధ్ కుమార్, ఎజిఎంలు వి శ్రీకాంత్, రాజీవ్ కుమార్, చీఫ్ మేనేజర్లు వూరే శేషు కుమారి, హరిత టి, దీపాంకర్ తుడు, రీజినల్ విజిలెన్స్ ఆఫీసర్ మనీష్ కుమార్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.










