Apr 06,2023 17:07

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్యజిల్లా) : హైకోర్టు జడ్జి బి.కృష్ణమోహన్‌ కుటుంబ సమేతంగా గురువారం తాళ్లపాకలోని ఆలయాల సముదాయాలను సందర్శించారు. మూడవ అదనపు జిల్లా జడ్జి ఆర్‌.వి.వి.ఎస్‌ మురళి కష్ణ, జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.సంధ్యారాణి హైకోర్టు జడ్జి దంపతులను పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించి చెన్నకేశవ ఆలయం, శివాలయం, అన్నమయ్య ఆలయాలను దగ్గరుండి సందర్శింపజేశారు. ఆలయ పూజారులు హైకోర్టు జడ్జికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, కోర్టు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.