Sep 14,2023 10:46

ప్రజాశక్తి-అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. చిత్తూరు జిల్లా అంగళ్లులో చోటుచేసుకున్న ఘటనలో ఏ1గా చంద్రబాబుపై కేసు నమోదయింది. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే చంద్రబాబు పిటిషన్‌ ఈరోజు విచారణకు రాగా.. ఈ కేసును వాయిదా వేయాలని ప్రభుత్వ తరఫున న్యాయవాది దుష్యాంత్‌ రెడ్డి కోరారు. మరోవైపు అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడు పిటిషన్‌ విచారణ మంగళవారం(సెప్టెంబర్‌ 19) ఉందని, అదే రోజు ఈ పిటిషన్‌ను కూడా విచారించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. అయితే ఇరుపక్షాలతో మాట్లాడిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. కేసు పూర్తి వివరాలతో హాజరుకావాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.