న్యూయార్క్: అర్జెంటీనా టెన్నిస్ ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్‌పొట్రో యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ తర్వాత ఆటకు గుడ్‌బై చెప్పనున్నట్లు వెల్లడించాడు. 'ది అసోసియేటెడ్ ప్రెస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డెల్‌పొట్రో తన మనసులోని మాటను తెలిపాడు. మోకాలి గాయం కారణంగా ఏడాదిగా టెన్నిస్ క్రీడకు దూరంగా ఉంటున్నానని, వీడ్కోలు మ్యాచ్ యుఎస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ అని పేర్కొన్నాడు. యుఎస్ ఓపెన్‌లోనూ 100% ఫిట్‌నెస్‌తో పాల్గొంటానన్న ధీమా తనలో లేదని, ఆ సమయానికైనా రాకెట్ పట్టే అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నాని 34ఏళ్ల డెల్‌పొట్రో వెల్లడించాడు. 2009లో ఫ్లషింగ్ మెడోస్ ట్రోఫీని గెలిచిన డెల్‌పొట్రో బిగ్ హిట్టర్‌గా పేరును సంపాదించాడు. 14ఏళ్ల క్రితం న్యూయార్క్‌లో యుఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచిన డెల్‌పొట్రో.. విజేతగా నిలిచే క్రమంలో రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ వంటి టాప్‌సీడ్ ఆటగాళ్లను ఓడించాడు.










