Jun 03,2023 22:02

సిడ్నీ: ఆస్ట్రేలియా సీనియర్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ వచ్చే ఏడాది జనవరిలో టెస్టులకు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రకటించాడు. జూన్‌ 16న ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్‌లో ఆడతానని, వచ్చే ఏడాది జనవరిలో సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో సొంత మైదానంలో జరిగే టెస్ట్‌ తర్వాత ఆ ఫార్మాట్‌ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు తెలిపాడు. ఫిట్‌గా ఉంటే 2024 ఐసిసి టి20 ప్రపంచకప్‌లో ఆడతానని, త్వరలో జరిగే డబ్ల్యుటిసి ఫైనల్‌, యాషెస్‌ సిరీస్‌, ఆ తర్వాత పాకిస్తాన్‌తో టెస్ట్‌ సిరీస్‌లే తన చివరి సిరీస్‌లని వెల్లడించాడు. ఐసిసి టెస్ట్‌ ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌కు ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్‌ వార్నర్‌ ఓ సభ్యుడు. ఇక భారత్‌ వేదికగా అక్టోబర్‌-నవంబర్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లోనూ ఆడనున్నట్లు 36ఏళ్ల వార్నర్‌ తెలిపాడు.