Jun 06,2023 21:56
  • ఆసియా అండర్‌-20 అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌

యోచియెన్‌(దక్షిణ కొరియా): ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో డెకథ్లాన్‌ విభాగంలో సునీల్‌ కుమార్‌ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. మంగళవారం జరిగిన డెకథ్లాన్‌లో సునీల్‌ కుమార్‌ 7003పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక మహిళల హైజంప్‌లో 1.82మీటర్లు జంప్‌ చేసి పూజ రజిత పతకం సాధించింది. మహిళల 3వేల మీ. రేస్‌, 4×100మీ. రిలేలో బుస్త్రా ఖాన్‌ 45.36సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. పురుషుల షాట్‌పుట్‌లో సిద్ధార్థ్‌ చౌదరి 19.52మీ. విసిరి స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. జావెలిన్‌ త్రోలో శివమ్‌ లొహకరే 72.34మీ. విసిరి రజితం, పురుషుల 3వేల మీ. స్ట్రీపుల్‌ ఛేజ్‌లో 8నిమిషాల 51.74సెకన్లలో గమ్యానికి షారుక్‌ ఖాన్‌ రజిత పతకం సాధించారు. దీంతో భారత్‌ ఓవరాల్‌గా 12పతకాలతో 3వ స్థానంలో కొనసాగుతోంది. భారత్‌ మూడేసి స్వర్ణ, రజిత, కాంస్య పతకాలతో మూడో స్థానంలో ఉంది. ఇక జపాన్‌ 10స్వర్ణాలతో సమా మొత్తం 17పతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. చైనా 14 పతకాలతో రెండోస్థానంలో ఉంది.