హైదరాబాద్ : హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ మార్కెట్లోకి రెండు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇన్‌స్టంట్ ఎనర్జీ డ్రింక్ గ్లూకోశక్తి, మరొకటి క్రీమీలీషియస్ పెరుగు ఉన్నాయి. శ్రమించే వారికి అప్పటికప్పుడు శక్తిని అందించేందుకు గ్లూకోశక్తి దోహదం చేస్తుందని పేర్కొంది. ఇందులో సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఖనిజాలుంటాయని ఆ కంపెనీ వైస్ చైర్‌పర్సన్, ఎండి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. 200 ఎంఎల్ ధరను రూ.10గా నిర్ణయించారు. బత్తాయి రుచితో కూడిన 200 ఎంఎల్ ఎనర్జీ డ్రింక్ ప్యాక్ ధర రూ.10గా ప్రకటించారు.










