Jan 20,2023 20:49

న్యూఢిల్లీ : డిజిటల్‌ చెల్లింపుల యాప్‌ ఫోన్‌పే తాజాగా రూ.2,850 కోట్ల (350 మిలియన్‌ డాలర్లు) సమీకరించినట్లు ప్రకటించింది. దీంతో ఆ కంపెనీ విలువ సుమారు రూ.97,800 కోట్ల (12 బిలియన్‌ డాలర్లు)కు చేరినట్లయ్యింది. దాదాపు 100 కోట్ల డాలర్ల మేర నిధులను సంస్థ సమీకరించనుండగా, జనరల్‌ అట్లాంటిక్‌తో పాటు మార్క్‌ గ్లోబల్‌ వంటి అంతర్జాతీయ, దేశీయంగా పేరున్న పెట్టుబడి సంస్థలు కూడా తాజా నిధుల సమీకరణ ప్రక్రియలో పాల్గంటున్నాయని ఫోన్‌పే తెలిపింది. 2020 డిసెంబర్‌ నాటితో పోల్చితే ఈ కంపెనీ విలువ రెట్టింపు అయ్యింది. ఈ సంస్థకు 40 కోట్ల మంది ఖాతాదారులున్నారు.