న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ రజ్నీష్ కుమార్ ప్రముఖ చెల్లింపుల టెక్నలాజీ కంపెనీ మాస్టర్ కార్డ్ ఇండియా చైర్మన్‌గా నియమితులయ్యారు. నాలుగు దశాబ్దాల పాటు బ్యాంకింగ్ రంగంలో అనుభవం కలిగిన రజ్నీష్.. ఎస్‌బిఐలో మూడేళ్ల పాటు ఛైర్మన్‌గా ఉన్నారు. ఎస్‌బిఐ మొబైల్ యాప్ యోనో రూపకల్పన, ఆదరణలో ఆయన కీలక పాత్ర పోశించారు.










