స్పిన్నర్ల దెబ్బకు ఆసీస్ కుదేల్..
తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 132పరుగుల తేడాతో టీమిండియా గెలుపు
అశ్విన్, జడేజా మాయాజాలం
నాగ్‌పూర్: టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలానికి ఆస్ట్రేలియా బ్యాటర్స్ రెండో ఇన్నింగ్స్ చేతులెత్తేశారు. దీంతో భారతజట్టు తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 132పరుగుల తేడాతో గెలిచి బోర్డర్‌ాగవాస్కర్ ట్రోఫీ నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యతలో నిలిచింది. ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 91పరుగులకే ఆలౌటై.. భారత్ చేతిలో ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 7వికెట్ల నష్టానికి 321పరుగులతో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారతజట్టు మరో 79పరుగులు జతచేసి మిగిలిన మూడు వికెట్లను కోల్పోయింది. అక్షర్ పటేల్(84) అర్ధసెంచరీతో మెరిసాడు. చివరి వికెట్‌గా అక్షర్ పటేల్ ఔట్ కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 400పరుగులకు ఆలౌటైంది. దీంతో భారతజట్టుకు 223 పరుగుల ఆధిక్యత సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు భారత స్పిన్నర్ల ధాటికి 91 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో (3/42)తో ఆకట్టుకున్న అశ్విన్.. రెండో ఇన్నింగ్స్(5/37) స్పిన్ మాయాజాలంతో ఆసీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు 16 వికెట్లు పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రవీంద్ర జడేజాకు లభించింది.
స్కోర్‌బోర్డు..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 177ఆలౌట్
ఇండియా తొలి ఇన్నింగ్స్: 400ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఖవాజా (సి)కోహ్లి (బి)అశ్విన్ 5, వార్నర్ (ఎల్‌బి) అశ్విన్ 10, లబూషేన్ (ఎల్‌బి)అశ్విన్ 17, స్మిత్ (నాటౌట్) 25, రెన్‌షా (ఎల్‌బి) అశ్విన్ 2, హ్యాండ్‌కోంబ్ (ఎల్‌బి) అశ్విన్ 6, క్యారీ (ఎల్‌బి) 10, కమిన్స్ ((సి) శ్రీకర్ భరత్ (బి)జడేజా 1, మర్ఫీ (సి)రోహిత్ (బి)అక్షర్ 2, లియాన్ (బి)షమీ 2, బోలండ్ (ఎల్‌బి)షమీ 0, అదనం 5. (32.3ఓవర్లలో ఆలౌట్) 91పరుగులు.
వికెట్ల పతనం: 1/7, 2/26, 3/34, 4/42, 552, 6/64, 7/67, 8/75, 9/88, 10/91
బౌలింగ్: షమీ 4.3-1-13-2, అశ్విన్ 12-3-37-5, సిరాజ్ 1-1-0-0, జడేజా 12-3-34-2, అక్షర్ 3-0-5-1.










