Nov 02,2022 20:38

ముంబయి : అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒత్తిడికి గురైయ్యాయి. వరుసగా నాలుగో సెషన్లలో లాభాల్లో సాగిన సెన్సెక్స్‌, నిఫ్టీలు.. ఫెడ్‌ భయాలతో బుధవారం నష్టాలు చవి చూశాయి. అమ్మకాల ఒత్తిడితో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 215 పాయింట్లు కోల్పోయి 60,906 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 62 పాయింట్లు తగ్గి 18,083 వద్ద నమోదయ్యింది. ఆసియా-పసిఫిక్‌ ఎక్సేంజీల్లోనూ నష్టాలు చవి చూశాయి. సెన్సెక్స్‌ 30లో 8 స్టాక్స్‌ మాత్రమే రాణించగా.. 22 సూచీలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి.