May 02,2023 15:04

ప్రజాశక్తి-కలకడ(అన్నమయ్యజిల్లా) : దొడ్డిపల్లెలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులకు ఉచిత సేవలు అందించి, ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎండలు విపరీతంగా కాస్తున్న తరుణంలో సన్‌ స్ట్రోక్‌ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ సన్‌ స్ట్రోక్‌ బారిన పడకుండా ఇంతకు జాగ్రత్తలు సూచనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలోఏ.న్‌.ఎం. సి. లక్ష్మి దేవి, ఆశలు,పద్మావతి, 104 రోజా ,రమేష్‌ సిబ్బంది పాల్గొన్నారు.