వాషింగ్టన్ : ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్ మాతసంస్థ మెటా కూడా ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ వారంలోనే ఉద్వాసనలు ఉండొచ్చని తెలుస్తోంది. వేలాది ఉద్యోగులను ఇంటికి పంపించడానికి జాబితాను కూడా సిద్దం చేశారని వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. బుధవారమే దీనిపై ప్రకటన రానుందని సమాచారం. సెప్టెంబర్ ముగింపు నాటికి ఈ సంస్థలో 87వేల మంది పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ట్విట్టర్ ప్రపంచ వ్యాప్తంగా 3700 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఇదే బాటలో మేటా నిర్ణయాలు తీసుకుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.










