May 02,2023 12:51

ప్రతిరోజూ జాయింట్‌ పెయిన్స్‌తో బాధపడుతున్నారా?! తరచూ మందులు వాడుతున్నా.. నొప్పులు పెరుగుతూనే ఉన్నాయని ఇటీవల చాలామంది చెబుతున్నారు. ఈ నొప్పులు తగ్గాలంటే.. మందులతోపాటు జీవనశైలిలో కూడా మార్పులు చేసుకుంటే.. తప్పనిసరిగా ఈ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..!

సరైన నిద్ర : రోజూ సరైన నిద్ర లేకపోవడం వల్ల.. మెదడు నరాలు ప్రభావితమై.. అది కీళ్ల నొప్పులకు దారితీసుంది. అందుకే రోజూ సరైన నిద్రపోవాలి. అలాగే నిద్రకు ఉపక్రమించే ముందు కాఫీ, టీ వంటి వాటిని తాగకూడదు. మీరు పడుకునే గదిలో శరీరానికి తగ్గ ఉష్ణోగ్రతలుండేలా చూసుకోవాలి. ఏసీలాంటివి ఉన్నా..గదిలో చల్లదనం ఎక్కువై.. నిద్రకు భంగం కలగవచ్చు. కూలర్‌, ఎసి లాంటివి ఎలక్ట్రిక్‌ వస్తువులను నిద్రపోయే ముందు వాడకుండా ఉంటేనే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

వ్యాయామం : ప్రతిరోజూ వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది. రోజూ గంటల తరబడి వ్యాయామం చేయాల్సిన పనిలేదు. సరదాగా స్విమ్మింగ్‌ లాంటివి కూడా చేయొచ్చు. నడవడంతోపాటు స్విమ్మింగ్‌ వంటి వ్యాయామాల ద్వారా శరీర కదలికల ద్వారా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

థెరపీ : కీళ్లనొప్పులు తగ్గాలంటే ఫిజికల్‌ థెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ, కాగ్నిటివ్‌ థెరపీలతోపాటు మానసిక ఆరోగ్యానికి బిహేవియరల్‌ థెరపీ వంటివి కూడా ఎంతో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు.