Nov 11,2023 14:40

చంద్రమోహన్‌ సినిమాల్లో నటించిన డబ్బుతో ఆస్తి కూడగట్టుకున్నా.. దాన్ని నిలబెట్టుకోలేకపోయినట్లు ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్‌ మాట్లాడుతూ.. 'హైదరాబాద్‌లోని కోంపల్లిలో గొల్లపూడి మారుతీరావు ద్రాక్షతోట కొన్నారు. ఆయన నన్ను కూడా కొనమని చెబితే.. సరేనని నేను 35 ఎకరాల దాకా కొన్నాను. కొనడానికైతే కొన్నాను కానీ.. ఆ తోటను చూసుకునేందుకు వీలుపడలేదు. దాంతో ఆ పొలం ఎందుకు అని మొత్తం భూమిని అమ్మేశాను. అలాగే శోభన్‌బాబు చెబుతున్నా వినకుండా.. చెన్నైలో 15 ఎకరాల భూమిని అమ్మేశా. ఇప్పుడు దాని విలువ సుమారు రూ. 30 కోట్లు పైనే ఉంది. శంషాబాద్‌లో ప్రధాన రహదారి పక్కన ఆరెకరాల్ని కూడా అమ్మేశాను. ఇలా దాదాపు వంద కోట్లు విలువ చేసే ఆస్తులు పోగొట్టుకున్నాను' అని ఆయన విచారం వ్యక్తం చేశారు.