Feb 11,2023 21:47

ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌
పార్ల్‌: ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌, శ్రీలంక జట్లు శుభారంభం చేశాయి. శనివారం జరిగిన గ్రూప్‌ా2 తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ అమ్మాయిలు 7వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ అమ్మాయిలపై గెలుపొందింది. టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లు నష్టపోయి 135పరుగులు చేసింది. కెప్టెన్‌ మాథ్యూస్‌(42), క్యాంప్‌బెల్లె(34) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఎక్లేస్టోన్‌కు మూడు, బ్రంట్‌, గ్లెన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో ఇంగ్లండ్‌ జట్టు 14.3ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 138పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ డంక్లే(34), స్కీవర్‌(40), కెప్టెన్‌ హీథర్‌ నైట్‌(32) బ్యాటింగ్‌లో రాణించారు.
శుక్రవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్‌ా1 తొలి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంక మహిళల జట్టు 3పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై సంచలన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 129పరుగులు చేయగా.. ఛేదనలో దక్షిణాఫ్రికా మహిళలజట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 9 వికెట్లు కోల్పోయి 126పరుగులే చేయగల్గింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఆటపట్టుకు లభించింది.
టి20 ప్రపంచకప్‌లో నేడు..
భారత్‌ × పాకిస్తాన్‌
(సాయంత్రం 6.30గం||లకు)
బంగ్లాదేశ్‌ × శ్రీలంక
(రాత్రి 10.30గం||లకు)