Oct 18,2022 12:10

ప్రజాశక్తి-కపిలేశ్వరం (అంబేద్కర్‌ కోనసీమ) : కపిలేశ్వరపురం మండలంలోని అంగర గాంధీ సెంటర్‌ సమీపంలో రహదారికి ఆనుకొని ఉన్న ఊర చెరువు ఆక్రమణకు గురైంది. మంగళవారం పలువురు ఈ సమస్యపై మాట్లాడుతూ ... సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు సగానికి పైగా ఆక్రమణలకు గురై అక్కడ అక్రమ కట్టడాలు వెలిశాయని తెలిపారు. సుమారు 30 సంవత్సరాలుగా ఈ చెరువు చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలలో వ్యాపారాలు కొనసాగుతున్నాయన్నారు. ఇటీవల కొంతమంది మరిన్ని అక్రమ కట్టడాల నిర్మాణాలు చేపట్టినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. మూడు వంతులకు పైగా ఆక్రమణకు గురైన ఈ చెరువు గట్టుపై ఉన్న మిగిలిన ఖాళీ స్థలంలో కొంతమంది ఎవరికి తోచిన విధంగా వారు ఆక్రమించుకుని హద్దులు ఏర్పాటు చేసుకున్నారనీ, దీనిపై అదేమిటి అని పలువురు ప్రశ్నించగా చెరువు చుట్టూ ఉన్న అక్రమణలు తొలగించినట్లయితే తాము కూడా తొలగిస్తామని చెప్పడం గమనార్హమని వాపోతున్నారు. గతంలో ఈ ఆక్రమణలపై ఉన్నతాధికారుల దఅష్టికి తీసుకెళ్లినప్పటికీ నేటికి ఆ సమస్య పరిష్కారం కాలేదని పలువురు ఆరోపిస్తున్నారు.