ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : స్థానిక చెంచుపేటలోని అపార్ట్‌మెంట్ నిర్మాణంలో ఆదివారం అపశృతి చోటు చేసుకుంది. సిమెంట్ పనులలో భాగంగా... పరంజా ఏర్పాటు చేస్తున్న కార్మికుడు వేమూరి శ్రీను (50)కు హై టెన్షన్ వైర్లు తగిలి విద్యుత్ షాక్ గురయ్యాడు. దాదాపు 90 శాతం కాలిన గాయాలతో ఉన్న అతనిని సహకార్మికులు చికిత్స నిమిత్తం తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.










