ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్యజిల్లా) : పట్టణ పరిధిలోని ఎర్రబల్లి గ్రామంలో మంగళవారం షేక్ రియాన్ అనే మూడు సంవత్సరాల బాలుడిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇంటి ముందు కూర్చుని ఆడుకుంటూ ఉండగా కుక్కలు దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన బాలుడిని తండ్రి షేక్ మజీద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ సిబ్బందితో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడిని, కుటుంబాన్ని పరామర్శించారు.
రాజంపేటలో వరుస కుక్కల దాడి ఘటనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పురపాలక సంస్థ కుక్కలను పట్టుకొని వేరే ప్రదేశాలకు తరలించడం అవి తిరిగి మళ్లీ యధా స్థానానికి చేరుకుని దాడులకు పాల్పడుతుండడంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారు. ఇందుకు శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు.










