- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ప్రజాశక్తి-అమరావతి:ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్పు, అంగళ్లు కేసుల్లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయొద్దని హైకోర్టు బుధవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. అంగళ్లు పోలీసులు నమోదు చేసిన కేసులో ఈ నెల 12వ తేదీ వరకు చంద్రబాబును అరెస్టు చేయరాదని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఈ నెల 16 వరకు వరకు అరెస్టు చేయరాదని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ నెల 16 వరకు ఎసిబి కోర్టులో సిఐడి దాఖలు చేసిన పిటి వారెంట్‌పై విచారణను వాయిదా వేసింది. ఈలోగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని ఎసిబి కోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.










